Posts

Showing posts from September, 2021

Abhiyum Anuvum Full Movie Explained in Telugu

Image
  ఇది ద్విభాషా చిత్రం. మలయాళంలో Abhiyude Katha Anuvinteyum అన్న పేరుతో విడుదలైంది. తమిళంలో మలయాళ నటుడు టోవినో థామస్ కి మొదటి సినిమా ! కొన్ని కొన్ని సినిమాలు కథాపరంగా చాల సాదా సీదాగా మొదలవుతాయి. దాదాపు సగం సినిమా అయ్యేదాకా కూడా ఈ కథలో కొత్తదనం ఏముంది అనుకుంటాం. కాని ఇంటర్వల్ వచ్చేసరికి సడన్ గా కథ ట్విస్ట్ తీసుకునేసరికి మనం ఉలిక్కిపడి ఈ కథలో ఏదో కొత్తదనం ఉందని అలర్ట్ అవుతాము. ఈ సినిమా విషయంలో కూడా అలాగే జరుగుతుంది. అభి అని పిలవబడే అభిమన్యు చెన్నైలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తుంటాడు. ఊటీలో ఆర్గానిక్ కూరగాయలు పండించి అమ్మే అను అనే అమ్మాయి ఫేస్ బుక్ లో పెట్టిన వీడియోని ఒక రోజు అభి చూస్తాడు. ఆ వీడియో అతనికి నచ్చి, ఆమె పోస్ట్ చేసిన ఇతర వీడియోలు కూడా చూస్తాడు. ఆమెలోని చలాకీతనం, సేవా కార్యక్రమాలు చూసి, ఆమె పట్ల అతను ఆకర్షితుడై ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతాడు. కాని ఆమె రిజెక్ట్ చేస్తుంది. అయినా పట్టువదలకుండా ప్రయత్నించి ఆమెతో ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయించుకుంటాడు. క్రమంగా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఒకసారి అభి ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ ఐ లవ్ యూ అని తన ప్రేమను వ్యక్తం చేస్తాడు.