Sridevi Soda Center Full Movie Explained in Telugu

"శ్రీదేవి సోడా సెంటర్" సినిమా చూశాను. నిజం చెప్పాలంటే సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కామన్ గా అనిపించింది. ఈ రోజు సినిమా చూస్తే ఎక్కడా కామన్ గా కనిపించ లేదు. జాతరకు వెళ్ళినట్లు సరదా సరదాగా ఫస్టాఫ్ అయిపోయింది. ‘అప్పుడే’ అని టైం చూస్తే ఇంటర్వల్ టైం అయింది. బయటకు వచ్చి కాఫీ తాగుతూ "భలే తీశారే, టైంమే తెలియలేదు’’ అని నాలో నేనే మురిసిపోతున్నాను. ఆ ఆనందంలో "ఫస్టాఫ్ సూపర్" అని కొందరికి మెసేజ్లు కూడా పెట్టాను.

Read the New Telugu Movies on OTT 2021-2022

Sridevi Soda Center Review and Explained in Telugu


లోపలికి వచ్చాను.
సినిమా మొదలైంది. ఫ్లాట్ పాయింట్ టూ ఆశ్చర్యానికి గురిచేస్తూ నన్ను లాక్ చేసింది.! దానితో పాత్రలు హాయిగా స్క్రీన్ మీద నవ్వుతూ పాటలు పాడుకుంటున్నాయి కానీ నాలో తెలియని ఆందోళన మొదలైంది.! పాట తర్వాత ఏమవుతుంది?, ఏమవుతుంది అనే ఆలోచనలు నన్ను కుదురుగా కూర్చోనివ్వలేదు. అనుకున్నంతా అయ్యింది.! సూరి బాబు మీద కోపం వచ్చింది. "ఓరి నీ ప్రేమ చల్లగుండ ఎంత పని చేసావ్రా సూరి బాబూ" అనుకున్నాను. తర్వాత వన్ బై వన్ రివీల్ చేసుకుంటూ క్లైమాక్స్కు వెళ్లిన విధానం సీట్ ఎడ్జ్ న కుర్చోబెట్టింది.! సినిమా అయిపోయింది.! కానీ నేను మాత్రం కూర్చున్న సీట్లోనే ఉన్నాను. గుండె బరువెక్కింది. జేబులో ఉన్న కర్చీఫ్ తీసుకుని బయటకు వస్తుంటే అందరూ డల్గానే ఉన్నారు. నాతో పాటు చాలా మంది కనెక్ట్ అయ్యారన్నమాట అనుకున్నాను. క్లైమాక్స్ మాత్రం తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకూ రానిదని మాత్రం ఖచ్ఛితంగా చెప్పగలను. మరోసారి గట్టిగా తెలుగు సినిమా ప్రేమికులు తలుచుకునే పేరు 'కరుణ కుమార్' తెలుగు సినిమాకి ఓ పా. రంజిత్, వెట్రిమారన్, మారి సెల్వరాజ్ దొరికారేమో కరుణ కుమార్ రూపంలో అనిపిస్తుంది.
కాశీ నాగేంద్ర రాసిన కథ మట్టిలో గీసుకున్న కుల గీతల్ని చాలా సహజంగా పట్టుకుంది. ఇక ఎండ్లూరి సూరిబాబు (సుధీర్ బాబు) పర్ఫామెన్స్ చాలా కొత్తగా ఉంటూ గోదావరి కుర్రాడ్ని అచ్చుగుద్దినట్లు తన నటనలో దింపేశాడు. సుధీర్ బాబు నుండి ఈ లైటింగ్ సూరిబాబును బయటకు లాగిన ఘనత కరుణ కుమార్ కే దక్కుతుంది. ఎందుకంటే ఇంత కొత్తగా సుధీర్ బాబు ఇప్పటి వరకూ మనం చూడలేదు. శ్రీదేవిగా (ఆనంది) నటన చాలా సహజంగా పక్కింటి అమ్మాయిలా అనిపించింది. అలాగే పెద్ద నరేష్ గారి నటన గుర్తుండిపోయేలా ఉంటుంది. విలన్ గా కాశీ, సత్యం రాజేష్, రఘుబాబు, కత్తి మహేష్ ఇలా అందరి నటన ఆకట్టుకునే విధంగా ఉంది. ప్రొడ్యూసర్స్ విజయ్, శశి ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా చాలా గ్రాండ్ గా క్వాలిటీగా సినిమాను నిర్మించారు. భవిష్యత్తులో వీళ్ళ దగ్గర నుంచి మరిన్ని ఇలాంటి ఆలోచింపజేసే సినిమాలు రావాలని కోరుకుందాం. మణిశర్మగారి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా కొత్తగా వినిపించింది. కెమెరా, ఎడిటింగ్ కూడా చాలా బాగున్నాయి. "గొప్ప సినిమాకి ఉండే క్వాలిటీ ఏమిటి" అని ఒక సినీ పండితుడ్ని అడిగితే "సింపుల్ సిటీ" అని సమాధానం ఇచ్చాడు. ఆ క్వాలిటీ ఈ సినిమాలో ఉంది. దానికి మంచి ఉదాహరణ ‘ఎండ్లూరి’ అనే ఇంటి పేరు వాడి ఎన్నో చెప్పకుండానే చెప్పారు. అది స్క్రీన్ మీదే చూడండి. తప్పకుండా థియేటర్స్ కు వెళ్ళి సుగంథి సోడా లాంటి సుధీర్, లెమన్ లాంటి ఆనంది పర్ఫామెన్సుల్ని దింపకుండా గోలి గొంతులోకి పోకుండా తాగేయండి.!
Read: OTT List

Comments

Popular posts from this blog

Abhiyum Anuvum Full Movie Explained in Telugu

సత్యమే శివం (తెలుగు); అంబే శివం (తమిళం) LOVE IS GOD

Dia Full Movie in Telugu Explained