Pushpa Movie Villain: Fahadh Faasil

Pushpa Movie Villain: Fahadh Faasil విలన్ అంటే భారీ కాయం గుబురు మీసాలు భీతావహమైన రూపం, ఖంగుమనే స్వరం ఉండాలన్న రూల్ ని శివ సినిమాతో రఘువరన్ ని విలన్ గా పరిచయం చేయడం ద్వారా రామ్ గోపాల్ వర్మ బ్రేక్ చేసాడు. అప్పటినుంచి కొత్త తరహా విలన్లు వస్తూనే ఉన్నారు. విలన్లగా నటించి హీరోలుగా చేసిన వాళ్ళున్నారు. హీరోలుగా నటించి విలన్లగా అవతారం ఎత్తిన వాళ్ళూ ఉన్నారు. కానీ ఒకపక్క హీరోగా నటిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా సంపూర్ణమైన నటుడిగా గుర్తింపు పొందిన ఫహాద్ విలనిజం గురించే కాస్త ఎక్కువ మాట్లాడుకోవచ్చు. ఏమాత్రం ఒడ్డు పొడుగు లేని పొట్టిగా ఉండే సన్నని రూపం దానికి తోడు కాస్త బట్టతల ఇవేమీ నటుడిగా విజయవంతం కావడాన్ని ఫహాద్ ని ఆపలేక పోయాయి. పరిపూర్ణ నటుడిగా ఎన్నో విలక్షణ పాత్రలను పోషిస్తూ ప్రేక్షకుల మదిలో తనదైన ముద్రను వేసాడు ఫాహాద్. చిన్ని చిన్ని పాత్రలను పోషించడానికి కూడా ఫహాద్ ఏమాత్రం వెనుకాడదు. మంచి ఫార్మ్ లో ఉన్న హీరోగా మళయాళంలో తనకున్న క్రేజ్ & మార్కెట్ కి చిన్న చిన్న పాత్రలు చేయడానికి ముందుకు రావడం అద్భుతమైన విషయంగా చెప్పుకోవచ్చు. చిన్న చిన్న పాత్రలతో పాటు విలన్ గా కూడా మెప్పించడం తనకే చెల్లింది. వ